భారత్ చేతిలో కిల్లర్ మిస్సైల్... చైనా నౌక ఫ్యుజియాన్ ను నిమిషాల్లో ధ్వంసం చేయగలదు!
- భారత్ అమ్ములపొదిలో 'ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్' క్షిపణి
- గంటకు 12,000 కిలోమీటర్ల వేగం, 1,500 కిలోమీటర్ల దాడి పరిధి
- చైనాకు చెందిన అత్యాధునిక ఫూజియన్ క్యారియర్‌ను సైతం ధ్వంసం చేయగల సామర్థ్యం
- డీఆర్‌డీఓ అభివృద్ధి.. త్వరలో నౌకాదళంతో యూజర్ ట్రయల్స్ ప్రారంభం
- హిందూ మహాసముద్రంలో గణనీయంగా పెరగనున్న భారత సైనిక శక్తి
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. శత్రు దేశాల భారీ యుద్ధ నౌకలను, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను సైతం సముద్రంలోనే జలసమాధి చేయగల అత్యంత శక్తివంతమైన హైపర్‌సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది. దీనిని 'ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్'గా అభివర్ణిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలకు చెక్ పెట్టేలా దీనిని రూపొందించడం విశేషం.
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఈ లాంగ్ రేంజ్ యాంటీ-షిప్ హైపర్‌సోనిక్ మిస్సైల్ (ఎల్‌ఆర్-ఏఎస్ హెచ్ఎం)ను దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు దాదాపు 12,000 కిలోమీటర్ల (మాక్ 8 నుంచి 10) అసాధారణ వేగంతో ప్రయాణించడం దీని అతిపెద్ద బలం. ఈ వేగం కారణంగా శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీనిని గుర్తించి అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఒక వేళ రాడార్ పై కనిపించినా, శత్రు దేశాలు స్పందించేలోపే లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఆ మిస్సైల్ సొంతం. ఇది 1500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకుంటుంది అంటే దీని సత్తా ఏంటో అర్థమవుతుంది.
చైనా నిర్మించిన అత్యాధునిక 'ఫ్యుజియాన్' విమాన వాహక నౌకను కూడా ఇది నిమిషాల్లో ధ్వంసం చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ క్షిపణి, భారత నౌకాదళంతో యూజర్ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల ఒడిశా తీరంలో జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి. 2027-28 మధ్యలో తుది ట్రయల్స్ ప్రారంభించి, 2029-30 నాటికి పూర్తిస్థాయిలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ఓ కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ క్షిపణి వ్యవస్థ అందుబాటులోకి వస్తే హిందూ మహాసముద్రంలో భారత భద్రతా సామర్థ్యం, నిరోధక శక్తి కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. సముద్ర తీర ప్రాంత రక్షణ మరింత పటిష్ఠం కానుంది.