తెలంగాణ హైకోర్టు సీజే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన రేవంత్ రెడ్డి

Revanth Reddy Attends Telangana High Court CJ Sons Wedding Reception
  • ఢిల్లీలో తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ వేడుక
  • రిసెప్షన్‌కు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో పర్యటించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సాయంత్రం జరిగిన రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
 
Revanth Reddy
Telangana
Telangana High Court
Justice Aparesh Kumar Singh
Delhi
Wedding Reception
Chief Minister
Shamshabad Airport

More Telugu News