టాలీవుడ్ సంక్షోభం... పర్సంటేజీ విధానంపై కమిటీలో సభ్యులు వీరే!
- సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ దృష్టి
- పరిష్కారం కోసం ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు
- నిర్మాతలు, ఎగ్జిబిటర్, పంపిణీదారుల నుంచి ఏడుగురు చొప్పున సభ్యులు
- మొత్తం 21 మందితో సమస్య పరిష్కారానికి చర్చలు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల 'పర్సంటేజీ విధానం' సమస్య పరిష్కారం దిశగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమైయ్యారు.
సమావేశంలో ఉప కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం నిర్మాతలు, పంపిణీదారుల రంగాల నుంచి సభ్యులను నామినేట్ చేశారు. ఈ ఉప కమిటీలో నిర్మాతల రంగం నుంచి ఏడుగురు, పంపిణీదారుల రంగం నుంచి ఏడుగురు, ఎగ్జిబిటర్ల రంగం నుంచి ఏడుగురిని ఎంపిక చేశారు. మొత్తం 21 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేయనుంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్ నారాయణ, కె. అశోక్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ కమిటీ పని చేయనుందని ఫిల్మ్ ఛాంబర్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
కమిటీలోని సభ్యుల వివరాలు ఇలా..

- నిర్మాతల రంగం సభ్యులు: వై. సురేందర్ రెడ్డి, యార్లగడ్డ సుప్రియ, యలమంచిలి రవిశంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్.కె.ఎన్.టి. ప్రసన్న కుమార్.
- ఎగ్జిబిటర్ రంగం నుంచి: వి. ప్రతాప్ రెడ్డి, టి బాలగోవింద్ రాజ్, కె.అనుపమ్ రెడ్డి, పి శ్రీనివాసరావు, జి. వీరనారాయణ బాబు, కె వంశీ కిశోర్ (చిన్ని), ఎం విజేందర్ రెడ్డి.
- పంపిణీదారుల రంగం సభ్యులు: డి. విష్ణుమూర్తి, వి. వీర నాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలినేని.