తమిళనాడు సీఎం విజయ్ కి చిరంజీవి ఫోన్
- విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చిరంజీవి
- ఎంజీఆర్ లాగే నిస్వార్థ, ప్రజారంజక పాలన అందించాలన్న చిరంజీవి
- చిరంజీవిలాంటి పెద్దల మాటలు తనకు బలాన్నిస్తాయన్న విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వామపక్షాలు, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సినిమా పరిశ్రమకు చెందిన విజయ్ ముఖ్యమంత్రి కావడంతో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా, విజయ్‌కి ఫోన్ చేసిన చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఫోన్ కాల్ సందర్భంగా ఎంజీఆర్ పేరును మెగాస్టార్ ప్రస్తావించారు. ఎంజీఆర్‌లాగే నిస్వార్థమైన, ప్రజారంజక పాలన అందించి, తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
తనకు అభినందనలు తెలిపిన చిరంజీవికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవిలాంటి పెద్దల మాటలు తనకు ఎంతో బలాన్నిస్తాయని పేర్కొన్నారు. వీరి మధ్య సినిమాల గురించి కూడా చర్చ జరిగింది. తాను 'మన శంకర వర ప్రసాద్' సినిమాను చూశానని, అది తనకెంతగానో నచ్చిందని విజయ్ మెగాస్టార్‌తో అన్నారు. ఈ వయస్సులో కూడా చిరంజీవిని ఎనర్జిటిక్‌గా చూడటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి తదుపరి చిత్రం మంచి విజయం సాధించాలని ఈ సందర్భంగా విజయ్ ఆకాంక్షించారు.