టాలీవుడ్ సంక్షోభం... పర్సంటేజీ విధానంపై కమిటీలో సభ్యులు వీరే!

Daggubati Suresh Babu Leads Committee on Tollywood Crisis
  • సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ దృష్టి
  •  పరిష్కారం కోసం ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు
  •  నిర్మాతలు, ఎగ్జిబిటర్, పంపిణీదారుల నుంచి ఏడుగురు చొప్పున సభ్యులు
  •  మొత్తం 21 మందితో సమస్య పరిష్కారానికి చర్చలు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల 'పర్సంటేజీ విధానం' సమస్య పరిష్కారం దిశగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ‌లో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమైయ్యారు.

సమావేశంలో  ఉప కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం నిర్మాతలు, పంపిణీదారుల రంగాల నుంచి సభ్యులను నామినేట్ చేశారుఈ ఉప కమిటీలో నిర్మాతల రంగం నుంచి ఏడుగురు, పంపిణీదారుల రంగం నుంచి ఏడుగురు, ఎగ్జిబిటర్ల రంగం నుంచి ఏడుగురిని ఎంపిక చేశారు. మొత్తం 21 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేయనుంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్ నారాయణ, కె. అశోక్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ కమిటీ పని చేయనుందని ఫిల్మ్ ఛాంబర్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
 
కమిటీలోని సభ్యుల వివరాలు ఇలా..
 
  • నిర్మాతల రంగం సభ్యులు: వై. సురేందర్ రెడ్డి, యార్లగడ్డ సుప్రియ, యలమంచిలి రవిశంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్.కె.ఎన్.టి. ప్రసన్న కుమార్.
  • ఎగ్జిబిటర్ రంగం నుంచి: వి. ప్రతాప్ రెడ్డి, టి బాలగోవింద్ రాజ్, కె.అనుపమ్ రెడ్డి, పి శ్రీనివాసరావు, జి. వీరనారాయణ బాబు, కె వంశీ కిశోర్ (చిన్ని), ఎం విజేందర్ రెడ్డి. 
  • పంపిణీదారుల రంగం సభ్యులు: డి. విష్ణుమూర్తి, వి. వీర నాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలినేని.
 
 
Go Back to Shorts
Daggubati Suresh Babu
Telugu Film Chamber of Commerce
Tollywood crisis
percentage system
single screen theaters
film distribution
film exhibitors
Telugu cinema
Allu Aravind
Dil Raju

More Telugu News