నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy Reacts to NEET Exam Cancellation
  • పేపర్ లీక్ తో నీట్ పరీక్ష రద్దు
  • పారదర్శకమైన విచారణ జరపాలన్న రేవంత్ రెడ్డి
  • పోటీ పరీక్షలు విద్యార్థుల జీవితాలను నాశనం చేయకూడదని వ్యాఖ్య

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, పేపర్ లీక్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్రం పారదర్శకమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష రద్దు నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి ఘటనలు పరీక్షల వ్యవస్థపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.


ముఖ్యంగా పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థులు మళ్లీ ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. పోటీ పరీక్షలు అనేవి విద్యార్థుల ప్రతిభకు వేదిక కావాలి తప్ప, వారి జీవితాలను నాశనం చేసే సాధనాలుగా మారకూడదని ఆయన హితవు పలికారు. ఇదే సమయంలో ఆయన రాజకీయంగా కూడా విమర్శలు గుప్పించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఘటనల విషయంలో గత ప్రభుత్వ తీరు, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ వైఖరి ఒకేలా ఉందంటూ రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.

Go Back to Shorts
Revanth Reddy
NEET UG 2024
NEET exam paper leak
Telangana CM
Revanth Reddy on NEET
NEET exam cancel
BJP
Paper Leak Mafia

More Telugu News