ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య.. ఈసారి 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో యుద్ధం!
- ఇరాన్‌తో కాల్పుల విరమణ విఫలమైతే మళ్లీ దాడులు
- ఈసారి కొత్తపేరుతో యుద్ధం ప్రారంభించే యోచన
- వార్ పవర్స్ చట్టంలోని నిబంధనలు అధిగమించే వ్యూహం
ఇరాన్‌తో సైనిక ఘర్షణలు మళ్లీ మొదలైతే, చేపట్టబోయే సైనిక చర్యకు కొత్త పేరు పెట్టాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' స్థానంలో 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' అనే పేరును పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం విఫలమై, దాడులు పునఃప్రారంభమైతే ఈ కొత్త పేరుతో ఆపరేషన్ నిర్వహించాలని యోచిస్తున్నారు.
ఈ పేరు మార్పు వెనుక ఓ కీలకమైన చట్టపరమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 1973 నాటి వార్ పవర్స్ రిజల్యూషన్ ప్రకారం అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు 60 రోజులకు మించి సైనిక చర్యను కొనసాగించలేరు. ఆపరేషన్ పేరు మార్చడం ద్వారా, పాత ఆపరేషన్ ముగిసిందని, కొత్తది ప్రారంభమైందని వాదించి, ఆ 60 రోజుల గడువును మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది. ఈ విధంగా కాంగ్రెస్ అనుమతి లేకుండానే మరికొంత కాలం సైనిక చర్యలు కొనసాగించేందుకు అవకాశం లభిస్తుంది.
ఇరాన్‌తో ఫిబ్రవరి 28న ప్రారంభమైన సైనిక ఘర్షణలకు 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టారు. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, అది ఎప్పుడైనా విఫలం కావచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో దాడులు తిరిగి మొదలైతే వాటిని 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసేందుకు సెనెట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానాలు ఇప్పటికే స్వల్ప తేడాతో వీగిపోయిన నేపథ్యంలో, ఈ కొత్త ఎత్తుగడకు ప్రాధాన్యం ఏర్పడింది.