ఐపీఎల్ అభిమానులకు అలర్ట్.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ!
- ఐపీఎల్ సీజన్‌లో అభిమానులే లక్ష్యంగా 1000కి పైగా నకిలీ డొమైన్లు
- నకిలీ టికెట్లు, ఉచిత స్ట్రీమింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు
- అసలు వెబ్‌సైట్లను పోలిన డిజైన్లతో అభిమానులను సులభంగా నమ్మిస్తున్న వైనం
- డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మాల్‌వేర్‌ను వ్యాప్తి చేస్తున్న కేటుగాళ్లు
- అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన
దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంటున్న వేళ, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ అభిమానుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని మోసం చేసేందుకు 1,000కి పైగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. టికెట్లు, ఉచిత స్ట్రీమింగ్ పేరుతో ఈ మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ తన నివేదికలో వెల్లడించింది.
క్లౌడ్‌సెక్ విశ్లేషణ ప్రకారం నకిలీ ఐపీఎల్ టికెట్లు అమ్మేందుకు 600కు పైగా ఫేక్ డొమైన్లు, ఉచితంగా మ్యాచ్ చూపిస్తామంటూ నమ్మించే 400కు పైగా నకిలీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో చురుకుగా ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన మ్యాచ్‌ల సమయంలో చివరి నిమిషంలో టికెట్ల కోసం లేదా ఉచిత స్ట్రీమింగ్ కోసం వెతికే అభిమానుల ఆతృతను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది.
మోసం చేసే తీరు చాలా పక్కాగా..
ఈ నకిలీ వెబ్‌సైట్లను అచ్చం అసలు ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే రూపొందిస్తున్నారు. అధికారిక లోగోలు, లేఅవుట్‌లు, బుకింగ్ విధానాలను కాపీ కొట్టి, అభిమానులను సులభంగా నమ్మిస్తున్నారు. సీట్లు ఎంచుకోమని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయమని చెప్పి.. యూపీఐ (UPI), కార్డులు లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించాక, కొందరికి నకిలీ బుకింగ్ ఐడీ, క్యూఆర్ కోడ్‌లతో కూడిన ఫేక్ పీడీఎఫ్ టికెట్లను కూడా పంపిస్తున్నారు. తీరా స్టేడియం గేట్ల వద్దకు వెళ్లాక గానీ అది మోసమని బాధితులకు తెలియడం లేదు.
"ఈ మోసాలు ఎంత పకడ్బందీగా మారాయంటే, నేరగాళ్లు కేవలం నకిలీ టికెట్లు అమ్మడమే కాదు.. బాధితుల డేటాను సేకరించి, దాన్ని భవిష్యత్తులో ఇతర మోసాలకు వాడుకోవడమో? లేదా అమ్ముకోవడమో? చేస్తున్నారు. మెటా పిక్సెల్ వంటి టూల్స్‌ను ఉపయోగించి తమ మోసపూరిత ప్రచారాలను ట్రాక్ చేస్తూ, వాటిని మరింత మెరుగుపరుచుకుంటున్నారు" అని క్లౌడ్‌సెక్ పరిశోధకుడు సౌరజీత్ మజుందర్ వివరించారు.
ఉచిత స్ట్రీమింగ్ వెబ్‌సైట్లతో మరో ముప్పు
నకిలీ టికెట్ల బెడద ఒకవైపు ఉంటే, "ఐపీఎల్ ఫ్రీ లైవ్ స్ట్రీమ్" వంటి పదాలతో సెర్చ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకుని మరో రకమైన మోసానికి పాల్పడుతున్నారు. ఈ నకిలీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు యూజర్ల ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను పంపేందుకు, అనుమానాస్పద లింకులకు దారి మళ్లించేందుకు, కీలకమైన పాస్‌వర్డ్‌లను దొంగిలించేందుకు గేట్‌వేలుగా పనిచేస్తున్నాయని నివేదిక హెచ్చరించింది. అందుకే ఐపీఎల్ అభిమానులు టికెట్లు కొనుగోలు చేయడానికి, మ్యాచ్‌లు చూడటానికి కేవలం అధికారిక, విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.