విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి

Pawan Kalyan Resumes Duties Today in Amaravati
  • శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్
  • మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి
  • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రాక
  • గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ స్వాగతానికి ఏర్పాట్లు
శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్తారు. ఉదయం 11:30 గంటలకు ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పవన్ రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి వరకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
 
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh Deputy CM
Janasena
Amaravati
Mangalagiri
Gannavaram
AP Politics
Deputy Chief Minister
Pawan Kalyan Health

More Telugu News