తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala Temple Rush Decreases Offering Relief to Devotees
  • 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • సర్వదర్శనం కోసం వచ్చిన వారికి 8 గంటల్లో కలుగుతున్న దర్శనం
  • రూ. 300 టికెట్లు ఉన్న వారికి 4 గంటల్లో దర్శనం

కొన్ని రోజులుగా భక్తులతో కిటకిటలాడిన తిరుమలలో ఈరోజు రద్దీ తగ్గింది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారు. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు 8 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతోంది. రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 నుంచి 4 గంటల్లో దర్శనం అవుతోంది.
 

రద్దీ తగ్గడం వల్ల వసతి సౌకర్యాల విషయంలో కూడా సామాన్య భక్తులకు ఊరట లభిస్తోంది. ముఖ్యంగా శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ వంటి ప్రాంతాల్లోని గదులకు డిమాండ్ తగ్గింది. గతంలో ఈ గదులు కేవలం సిఫారసు లేఖలు ఉన్న వీఐపీలకు మాత్రమే దక్కేవి. అయితే, సిఫారసు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడం, రద్దీ తగ్గడంతో, ఖాళీగా ఉన్న ఈ గదులను దర్శన టికెట్లు ఉన్న సాధారణ భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Go Back to Shorts
Tirumala
Tirumala rush
TTD
Tirupati
Sripadmavathi
Special Darshan
Accommodation
Devotees
Temple
Andhra Pradesh

More Telugu News