రిచ్ కిడ్స్ కేసు: నిందితుడు జతిన్‌పై మరో పోక్సో కేసు నమోదు

jubilee hills rich kids case jathin pocso case
  • రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు నమోదు
  • ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్‌పై కేసు
  • శారీరకంగా వాడుకుని లక్షలు దోచుకున్నాడంటూ యువతి ఫిర్యాదు
  • గతంలో అరెస్టయినా రిమాండ్ తిరస్కరణతో బయటకు వచ్చిన జతిన్
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌‌లో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడైన జతిన్‌పై పోలీసులు తాజాగా మరోసారి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

జతిన్ తనను శారీరకంగా వాడుకుని, లక్షల రూపాయలు వసూలు చేశాడని ఓ యువతి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జతిన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ కేసులో గతంలోనే జతిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, కోర్టు రిమాండ్ తిరస్కరించడంతో అతడు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు.
 
సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని బాలికలు, యువతులను ఈ ముఠా ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన అర్జున్, అతడి సోదరుడు కలిసి లగ్జరీ కార్లలో షికార్లకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడేవారని, ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేసేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేరాల్లో నిందితులకు వారి తల్లి, మేనమామ కూడా సహకరించినట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితులు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
jubilee hills
rich kids case
jathin
pocso case

More Telugu News