లండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత

Konakati Pujitha Elected as Councillor in London Royal Albert Ward
  • ప్రతిపక్ష 'ది గ్రీన్ పార్టీ' తరపున విజయం సాధించిన యువతి
  • ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి అక్కడే రాజకీయాల్లోకి ప్రవేశం
  • నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న పూజిత
తెలంగాణ యువతి లండన్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొనకాటి పూజిత.. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 7న వెలువడగా, పూజిత విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.

ఆరున్నరేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం పూజిత లండన్ వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో లండన్‌లోనే పనిచేస్తున్న ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పూజిత ప్రతిపక్ష 'ది గ్రీన్ పార్టీ' అభ్యర్థిగా రాయల్ ఆల్బర్ట్ వార్డు నుంచి పోటీ చేశారు. ఈ వార్డులో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, పూజిత విజయం సాధించారు. ఆమె ఈ పదవిలో నాలుగేళ్ల పాటు కొనసాగుతారు. తెలంగాణ యువతి లండన్‌లో రాజకీయ విజయం సాధించడంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Konakati Pujitha
Royal Albert Ward
London Elections
Telangana
Green Party
Councillor
UK Local Elections
Bhoopalpally
Indian Diaspora

More Telugu News