'బజాజ్ చేతక్' అప్‌డేట్ అయింది... స్పీడు కూడా పెరిగింది!
- బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 2026 మోడల్ అప్‌డేట్
- ప్రీమియం వేరియంట్‌లో కొత్తగా గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్
- వివిధ మోడళ్లలో పెరిగిన టాప్ స్పీడ్, మెరుగైన పనితీరు
- కొత్తగా C సిరీస్ పేరుతో వేరియంట్ల విభజన
- రూ. 89,500 నుంచి ప్రారంభమవుతున్న కొత్త ధరలు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో, తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌ను 2026 మోడల్‌గా అప్‌డేట్ చేసింది. ఈసారి గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్, మెరుగైన పనితీరు వంటి కీలక మార్పులతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. తీవ్రమైన పోటీ ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ మార్పులు చేసింది.
ఈ అప్‌డేట్‌లో భాగంగా ప్రీమియం వేరియంట్ సీ3501లో గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్‌ను జోడించారు. చేతక్ యాప్ ద్వారా రైడర్లు తమ స్కూటర్ డిస్‌ప్లేలోనే రియల్-టైమ్ నావిగేషన్ పొందవచ్చు. దీంతోపాటు, సీ30, సీ35 సిరీస్‌లలో ఎకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను ఇప్పుడు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
పనితీరు విషయంలోనూ బజాజ్ పలు మెరుగుదలలు చేసింది. సీ2501 మోడల్ టాప్ స్పీడ్‌ను గంటకు 60 కి.మీ.కు, సీ3001 మోడల్ స్పీడ్‌ను 70 కి.మీ.కు పెంచారు. టాప్ వేరియంట్ సీ3501 మోటార్ పవర్‌ను 4.8 కేడబ్ల్యూ పెంచడం ద్వారా మెరుగైన యాక్సలరేషన్ అందిస్తుంది. అయితే, స్కూటర్ రేంజ్‌లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సీ3001 మోడల్‌లో చార్జింగ్ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించారు.
బజాజ్ తన వేరియంట్ల పేర్లను కూడా మార్చింది. ఇకపై చేతక్ స్కూటర్లు సీ25, సీ30, సీ35 అనే సిరీస్‌లలో లభించనున్నాయి. ఈ కొత్త మోడళ్ల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 89,500 కాగా, టాప్ వేరియంట్ సీ3501 ధర రూ. 1.34 లక్షల వరకు ఉంది. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం దగ్గరలోని బజాజ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.