ట్రంప్ వ్యాఖ్యలు.. గట్టి హెచ్చరిక జారీ చేసిన ఇరాన్

Iran warning on Trump comments
  • ఒక్క చమురు బావిపై దాడి చేస్తే నాలుగింటిపై దాడి చేస్తామన్న ఇరాన్
  • అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో నాలుగు రెట్లు ఎక్కువ విధ్వంసానికి పాల్పడుతామన్న ఇరాన్
  • ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో, తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ఇరాన్ ఉపాధ్యక్షుడు
శత్రువులు తమ ఒక్క చమురు బావిపై దాడి చేస్తే తాము నాలుగు చమురు బావులపై దాడులు చేస్తామని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ స్పందించారు.

చమురు క్షేత్రాలు సహా తమ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులకు పాల్పడితే అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో దానికి నాలుగు రెట్లు ఎక్కువ విధ్వంసానికి పాల్పడుతామని ఆయన హెచ్చరించారు. తమ లెక్కలు అందరిలా కాకుండా భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. శత్రువులు ఒక్క చమురు బావిపై దాడి చేస్తే తాము నాలుగింటిపై దాడి చేస్తామని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.

ట్రంప్ నిన్న ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే టెహ్రాన్‌లోని చమురు పైపులైన్‌లను పేల్చేస్తామని హెచ్చరించారు. ప్రధాన ఆర్థిక వనరు అయిన చమురును నాశనం చేస్తే ఆ దేశం తప్పకుండా తమ మాట వింటుందని అన్నారు.
Go Back to Shorts
Iran warning to trump
Iran warning to trump

More Telugu News