ఆర్టీసీ డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కార్మికులకు కీలక విజ్ఞప్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీసీ డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కార్మికులకు కీలక విజ్ఞప్తి

cm revanth reddy reacts to rtc driver shankar goud passedaway
  • నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
  • మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
  • క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంపై సీఎం తీవ్ర విచారం
  • తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి
  • సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. "క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది" అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఎలాంటి తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
Revanth Reddy
RTC Driver Shankar Goud
TGSRTC
RTC Strike

More Telugu News