ఇండోనేసియా హోటల్లో వస్తువులు తస్కరించిన భారతీయ టూరిస్టులు

ఇండోనేసియా హోటల్లో వస్తువులు తస్కరించిన భారతీయ టూరిస్టులు

Indian Tourists Accused of Stealing from Bali Hotel
  • బాలిలోని గియన్యార్ ప్రాంతంలోని రిసార్టులో దిగిన నలుగురు భారతీయులు
  • చెక్-అవుట్ అయ్యాక గదిలోని వస్తువులు కనిపించకపోవడంతో బ్యాగులు తనిఖీ చేసిన సిబ్బంది
  • హెయిర్ డ్రైయర్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్ బ్యాగులో గుర్తించిన హోటల్ సిబ్బంది
ఇండోనేషియాలోని బాలిలో, గియన్యార్ ప్రాంతంలోని ఒక విలాసవంతమైన రిసార్ట్ నుండి హోటల్ వస్తువులను తస్కరించారని నలుగురు భారతీయులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. చెక్-అవుట్ సమయంలో హోటల్ సిబ్బంది వారి బ్యాగులను తనిఖీ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హోటల్ ఖాళీ చేసే సమయంలో వారు అక్కడి వస్తువులను తస్కరించినట్లు తేలింది. వారి బ్యాగ్‌లో హెయిర్ డ్రైయర్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్ తదితర వస్తువులు లభించాయి.

భారత్‌కు చెందిన నలుగురు టూరిస్టులు గియన్యార్ ప్రాంతంలో ఉన్న హోటల్లో దిగారు. రెండు మూడు రోజులు అక్కడే ఉన్నారు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. బ్యాగులు సర్దుకుని బయటకు వచ్చారు. అదే సమయంలో హోటల్ సిబ్బంది రూంలను తనిఖీ చేయగా, కొన్ని వస్తువులు కనిపించలేదు. వెంటనే అనుమానం వచ్చి, వీరి బ్యాగులు తనిఖీ చేయగా గదిలో ఉండాల్సిన వస్తువులు లభ్యమయ్యాయి.

వారి బ్యాగుల్లో హోటల్‌కు చెందిన వివిధ రకాల వస్తువులు ఉండటం చూసి వారు ఖంగుతిన్నారు. ఈ వ్యవహారాన్ని సిబ్బంది హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఆ వస్తువులను వెనక్కి ఇచ్చిన తర్వాత భారత టూరిస్టులను వెళ్లిపోవడానికి యాజమాన్యం అంగీకరించింది. వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.
Advertisement
Indian Tourists
Bali
Indonesia
Hotel Theft
Gianyar
Hair Dryer
TV Remote
Door Mat
Tourism Crime

More Telugu News