ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!
- కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్
- పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన విజయ్ రాఘవేంద్ర
- ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో
- త్వరలో తెలుగులోను అందుబాటులోకి
అలాంటి విజయ్ రాఘవేంద్ర పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాకి దేవిప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించాడు. ప్రసాద్ - సాత్త్విక్ నిర్మించిన ఈ సినిమా, ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. కంటెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ రాఘవేంద్ర నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ప్రస్తుతం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు ఆడియోలోను అందుబాటులోకి రానుందని అంటున్నారు.
కథ విషయానికి వస్తే .. విలేజ్ నేపథ్యంలో .. 'అనెగుండ్ల' పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కథ నడుస్తుంది. ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. కాళ్లు - చేతులు కట్టేసి చాలా దారుణంగా హత్య చేస్తుంటారు. దాంతో చీకటిపడితేచాలు, అక్కడివారు బయటకి వెళ్లడానికి భయపడుతుంటారు. అలాంటి పరిస్థితులలో, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరున్న 'సీతారామ్' రంగంలోకి దిగుతాడు. ఆయన ఈ కేసును ఎలా ఛేదిస్తాడు? అనేదే కథ.