హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?

హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?

Iran responds on Indian tankers attack
  • రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు
  • కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
  • సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్
హర్మూజ్ జలసంధిలో ఇటీవల రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటనపై ఇరాన్ స్పందించింది. భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు జరిపింది తమ దళాలేనా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి మాట్లాడుతూ, మా బలగాలే భారత నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయా అనే అంశంపై సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయని అన్నారు.

శనివారం హర్మూజ్ జలసంధిలో ఐఆర్‌జీసీ అనుమతి లభించిన అనంతరం ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు జరిగాయి. దీనితో ఆ రెండు నౌకలు తిరిగి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లిపోయాయి. ఒక నౌకలో 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉంది. ఈ ఘటనపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇరాన్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించిన తర్వాత ఈ నౌకలు బయల్దేరగా, వాటిపై కాల్పులు జరగడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.
Advertisement
Indian tankers attacked
Strait of Hormuz

More Telugu News