హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే భారత నౌకలకు ఇండియన్ నేవీ కీలక అడ్వైజరీ

హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే భారత నౌకలకు ఇండియన్ నేవీ కీలక అడ్వైజరీ

indian navys advisory after firing incident
  • ఇటీవల రెండు భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు
  • ఈ నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేసిన భారత నౌకాదళం
  • తమ నుంచి ఆదేశాలు వచ్చాకే హర్మూజ్‌లో ప్రయాణించాలని సూచన
హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే భారత పతాక నౌకలకు ఇండియన్ నేవీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవల భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ అడ్వైజరీ జారీ చేసింది. లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే హర్మూజ్‌లో ప్రయాణించాలని సూచించింది.

హర్మూజ్ జలసంధిని దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్ధారించుకునేందుకే ఈ సూచనలని తెలిపింది. కాగా, హర్మూజ్ జలసంధికి సమీపంలో లారక్ ఐలాండ్ ఉంటుంది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 11 నౌకలు ఈ జలమార్గాన్ని దాటాయి. ఈ జలసంధిని దాటిన చివరి నౌక దేశ్ గరిమ ఏప్రిల్ 18న దీనిని దాటింది. అదేరోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనను విదేశాంగ శాఖ ఖండించింది. గతంలో అనేక నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరించిందని, కానీ ఈ నౌకలపై కాల్పులు జరిపిందని తీవ్ర నిరసన తెలిపింది.
Advertisement
indian navys advisory
strait of hormuz

More Telugu News