బూతుల కోచ్ పై వేటు పడింది!

Naval Singh Sacked Following Abuse Allegations by Sumit Antil
  • పారాలింపిక్ చాంపియన్ సుమిత్ యాంటీల్‌పై వేధింపులు
  • కోచ్ నావల్ సింగ్‌ను విధుల నుంచి తొలగించిన పారాలింపిక్ కమిటీ
  • సుమిత్‌కు మద్దతుగా నిలిచిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా
  • నావల్ సింగ్‌ను తొలగించామని స్పష్టం చేసిన పీసీఐ చీఫ్ దేవేంద్ర ఝఝారియా
  • ఏప్రిల్ 10న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు
భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, సీనియర్ కోచ్ నావల్ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. పారాలింపిక్ జావెలిన్ ఛాంపియన్ సుమిత్ ఆంటిల్ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీఐ చీఫ్ దేవేంద్ర ఝఝారియా ఆదివారం ధృవీకరించారు.

రెండుసార్లు పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన సుమిత్ యాంటీల్.. కోచ్ నావల్ సింగ్ తనను మానసికంగా వేధిస్తున్నారని, తనను, తన కుటుంబాన్ని బూతులతో దుర్భాషలాడుతున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేశారు. సుమిత్‌కు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా కూడా మద్దతుగా నిలిచారు. దేశంలోని పలువురు అగ్రశ్రేణి అథ్లెట్లు కలిసి ఏప్రిల్ 10న సాయ్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అంతకుముందే సాయ్ డిప్యూటీ డైరెక్టర్, టాప్స్ సీఈఓతో సుమిత్ ఈ విషయంపై చర్చించారు. అధికారులు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించగా, సుమిత్ దానిని తిరస్కరించారు. కోచ్ నుంచి తరచూ బూతు మాటలతో వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నానని, అందుకే చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో బోర్డు సమావేశమై నావల్ సింగ్‌ను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు పీసీఐ చీఫ్ ఝఝారియా స్పష్టం చేశారు. 2015లో ద్రోణాచార్య అవార్డు అందుకున్న నావల్ సింగ్, ఎందరో జాతీయ స్థాయి జావెలిన్ అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు యువ కోచ్‌లకు మార్గనిర్దేశం చేశారు. అయితే అనూహ్య రీతిలో వివాదంలో చిక్కుకున్నారు. 
Go Back to Shorts
Naval Singh
Sumit Antil
Paralympic Committee of India
PCI
Dronacharya Award
Javelin coach controversy
Sports Authority of India
SAI
Neeraj Chopra
Para Athletics

More Telugu News