ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్: అలియా భట్, షాహిద్ కపూర్‌లతో భారీ స్కెచ్!
- డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో భారీ యాక్షన్ మూవీ
- కీలక పాత్ర కోసం అలియాను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం
- విలన్ పాత్ర కోసం తెరపైకి షాహిద్ కపూర్ పేరు
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) కోసం చిత్రబృందం భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్-అలియా జోడీని మళ్ళీ వెండితెరపై చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఇది తీపి కబురు. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, అలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొదట ఈ పాత్ర కోసం మలయాళ నటుడు టొవినో థామస్‌ను అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు షాహిద్ కపూర్‌ను విలన్‌గా చూపించి పాన్-ఇండియా స్థాయిలో సినిమాపై అంచనాలు పెంచాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ తారాగణంపై అధికారిక ప్రకటన వస్తే, ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.