'మీ స్వరం శాశ్వతం'.. ఆశా భోంస్లేకు సైకత శిల్పంతో శ్రద్ధాంజలి
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతికి దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పేరొందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన కళ ద్వారా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఆశా జీ సైకత శిల్పాన్ని రూపొందించి, ఆమె స్మృతికి నివాళులర్పించారు.
ఈ ఇసుక శిల్పంలో ఆశా భోంస్లే చిరునవ్వు చిందిస్తున్న ముఖాన్ని సుదర్శన్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానానికి గుర్తుగా శిల్పం పక్కన ఒక పాతకాలపు గ్రామఫోన్ రికార్డును కూడా ఇసుకతో రూపొందించారు. ‘శ్రద్ధాంజలి - మీ స్వరం మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అనే సందేశాన్ని శిల్పంపై రాసి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.
సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, అవి కొద్ది సమయంలోనే వైరల్ అయ్యాయి. ‘ఒక దిగ్గజానికి సరైన నివాళి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూరీ తీరానికి వస్తున్న పర్యాటకులు సైతం ఈ సైకత శిల్పాన్ని చూసి ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తున్నారు.