ఆర్సీబీతో మ్యాచ్... సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబై

Mumbai Indianswon the toss and opts to field against RCB
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. "పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఈ మైదానంలో ఛేజింగ్ చేయడం ఎప్పుడూ మంచిది. ముందుగా లక్ష్యం తెలిస్తే దాన్ని ఛేదించడం సులభం అవుతుంది" అని తెలిపాడు. 

మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని, అయితే టాస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అన్నాడు. గత మ్యాచ్‌లో 200 పరుగులు చేయడం తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఘజన్‌ఫర్, దీపక్ చాహర్ స్థానంలో మిచెల్ శాంట్నర్, మయాంక్ మార్కండేలను తీసుకుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో జాకబ్ డఫీకి అవకాశం కల్పించింది.

రెండు జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాశ్ శర్మ. 
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు: జాకబ్ బెథెల్, వెంకటేశ్ అయ్యర్, రసిఖ్ దార్, స్వప్నిల్ సింగ్, మంగేష్ యాదవ్.

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే. 
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు: షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, అశ్వని కుమార్, కార్బిన్ బాష్, రఘు శర్మ, రాజ్ బావా.
Go Back to Shorts
Hardik Pandya
Mumbai Indians
Royal Challengers Bangalore
RCB
IPL 2026
Wankhede Stadium
Rajat Patidar
Virat Kohli
Jasprit Bumrah
Mitchell Santner

More Telugu News