సీఎస్కే-ఢిల్లీ మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై ఆటగాళ్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఈ సీజన్లో తమ తొలి గెలుపును నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం కన్నా ఓ వివాదమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, ఆగ్రహంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే... ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. అప్పటికే దూకుడుగా ఆడుతూ ఢిల్లీని గెలుపు దిశగా తీసుకెళుతున్నాడు ట్రిస్టన్ స్టబ్స్. ఈ క్రమంలో చెమటకు గ్లోవ్స్ తడిచిపోయి బ్యాట్ స్లిప్ అవుతుందని గమనించిన స్టబ్స్ డగౌట్స్ వైపు చూశాడు. కరుణ్ నాయర్, నితీశ్ రాణా గ్లోవ్స్‌తో రెడీగా ఉన్నారు. కానీ లైన్ అంపైర్ మాత్రం లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. కాసేపు ఆగాలని చెప్పడం.. ఆ వెంటనే షాట్‌కి ప్రయత్నించి బ్యాట్ స్లిప్ అవడంతో ట్రిస్టన్ స్టబ్స్ అవుటవ్వడం ఒకేసారి జరిగాయి.
దీంతో తీవ్ర అసహనానికి గురైన అతను, పెవిలియన్ చేరాక డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. ఇదే సమయంలో మరో ఆటగాడు నితీశ్ రాణా కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అతనితో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అసలు ఎందుకు అనుమతించలేదు అని గట్టిగా అడిగితే.. మాకు ముందుగా మీరు చెప్పలేదంటూ అంపైర్ సమాధానం ఇచ్చాడు. కోపంతో ఊగిపోయిన నితీశ్ రాణా.. మరి సీఎస్కేను ఎలా అనుమతించారు? వాళ్లకి ఒక రూలు, మాకు ఒక రూలా? అంటూ వాగ్వాదానికి దిగాడు. ఇక, కీలక సమయంలో ఈ వికెట్ కోల్పోవడంతో ఢిల్లీ మ్యాచ్‌పై పట్టును కోల్పోయింది. దీంతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. ఈ వివాదమే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందనే చర్చ క్రీడా వర్గాల్లో నడుస్తోంది.