వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga Comments on Dhurandhar 2 Controversy
షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఇటీవల దేశవ్యాప్తంగా విజయం సాధించిన 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆయన తన 'స్పిరిట్' హీరో ప్రభాస్‌తో కలిసి వీక్షించారు. అనంతరం ఈ సినిమాను 'ప్రొపగండా' అంటూ విమర్శిస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు.

గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. "చాలా మంది రచయితలు, నటులు ప్రొపగండా ద్వారానే తమ కెరీర్‌లను నిర్మించుకున్నారు. అప్పుడు పిల్లుల్లా మౌనంగా ఉన్న ఇండస్ట్రీ.. ఇప్పుడు 'ధురంధర్' వంటి సినిమాలను ఎగతాళి చేస్తోంది. ఎదుటివారిని హేళన చేయడమే మీ మొదటి నైజం అయితే, మిమ్మల్ని మీరు లిబరల్స్ అని పిలుచుకునే అర్హత లేదు" అని ఆయన విమర్శించారు. నిజాన్ని ప్రొపగండా అనడం వింత ఫ్యాషన్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా అద్భుతంగా ఉందని చెబుతూ, దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో ప్రశంసించారు. "ఈ దిష్టి గుప్పెడు ఎండుమిర్చితో పోదు, ఏకంగా పొలాన్నే తగలబెట్టాలి" అని ఆయన చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఈ సినిమా ఔట్‌స్టాండింగ్‌గా ఉందని వంగా ప్రశంసించారు.

బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కలిసి 'ధురంధర్ 2' చూడటంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో 'స్పిరిట్' అనే భారీ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. 
 
Go Back to Shorts
Sandeep Reddy Vanga
Dhurandhar 2
Prabhas
Spirit Movie
Aditya Dhar
Ranveer Singh
Propaganda
Bollywood
Movie Review
Criticism

More Telugu News