హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

Hyderabad Road Accident Three Dead After Car Drags Youth
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో హోండా కారును వేగంగా నడిపిన ఒక డ్రైవర్, రోడ్డు మీద నడిచి వెళుతున్న యువకుడిని, బైక్ మీద వెళుతున్న మరో ఇద్దరు యువకులను ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత కారు పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు శివ, సందీప్ మృతి చెందారు. రోడ్డుపై నడిచి వెళుతున్న యువకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు.

కాలేజీ విద్యార్థులు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad Road Accident
Sagar Road
Hastinapuram
Road Accident
Drunk Driving
Mahaveer Engineering College

More Telugu News