Ambati Rayudu: బెంగళూరుతో ఓటమి.. అందుకే చెన్నై ఓడిపోయిందన్న అంబటిరాయుడు

Ambati Rayudu on Chennai Super Kings Loss to RCB
షార్ట్స్‌లో చూడండి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వ్యూహాలు బాగాలేవని, ధోనీ ఉండి ఉంటే కచ్చితంగా వీటిని ఆమోదించకపోయేవాడని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. ఆర్సీబీ చేతిలో చెన్నై 43 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాయుడు మాట్లాడుతూ, చెన్నై చివరి నాలుగు ఓవర్లలో 78 పరుగులు ఇచ్చిందని గుర్తు చేశాడు. డెత్ ఓవర్లలో సీఎస్కే వ్యూహాలు బాగా లేవని అన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కొత్త ప్రణాళికలు వేసినా కూడా ధోని అంగీకరించే వ్యక్తి కాదని తెలిపాడు. బ్యాట్స్‌మెన్ సులువుగా ఎదుర్కొంటారనే విషయం ధోనీకి బాగా తెలుసని అన్నాడు. డెత్ ఓవర్లలో ఎక్కువగా యార్కర్లు, లెంగ్త్‌తో కూడిన స్లో బంతులే ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు.

వీటిపై సీఎస్కే బౌలర్లు దృష్టి సారిస్తే బాగుంటుందని రాయుడు సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణమని వ్యాఖ్యానించాడు. తమ బౌలింగ్‌ను సీఎస్కే సమీక్షించుకోవాలని సూచించాడు. సంప్రదాయ బౌలింగ్‌పై దృష్టి సారించాలని అన్నాడు.

అటు, బెంగళూరు బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ దూకుడైన ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయిందని సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. టిమ్ చివరి ఐదు ఓవర్లలో వేగవంతంగా ఆడాడని చెప్పాడు. అతడి ఆటతీరుతో మ్యాచ్ మలుపు తిరిగిందని అన్నాడు.

తమ జట్టులో సంజు శాంసన్‌పై తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశాడు. జట్టులో అతడు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని, అతడి నుంచి కచ్చితంగా మంచి ఇన్నింగ్స్ చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పిచ్‌పై 210 నుంచి 220 పరుగులు చేయవచ్చని, కానీ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు 250కి పైగా పరుగులు చేసిందని అన్నాడు. టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Ambati Rayudu
Chennai Super Kings
CSK
RCB
Royal Challengers Bangalore
MS Dhoni
IPL 2024

More Telugu News