Godavarikhani Police: 'పోలీస్ మామలు' గ్రూప్‌కు షాకిచ్చిన ఎస్సై.. వీడియో ఇదిగో!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొందరు యువకులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల కళ్లుగప్పేందుకు వారు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లోకి ఓ ట్రాఫిక్ ఎస్సై ఎంట్రీ ఇచ్చి వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
గోదావరిఖని పట్టణంలో పోలీసులు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారో తెలుసుకునేందుకు కొందరు యువకులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు. ఇందులో 1,024 మంది సభ్యులు ఉన్నారు. తనిఖీల సమాచారాన్ని గ్రూప్‌లో పంచుకుంటూ, ఆ దారుల్లో వెళ్లకుండా జాగ్రత్తపడేవారు. అయితే ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ యువకుడి ఫోన్‌ను పరిశీలించగా ఈ గ్రూప్ వ్యవహారం బయటపడింది.
విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై వెంటనే అప్రమత్తమయ్యారు. పట్టుబడిన యువకుడి ఫోన్ నుంచే ఆ గ్రూప్‌లోకి ప్రవేశించారు. ఎస్సై గ్రూప్‌లో చేరడంతో కంగారుపడిన సభ్యులు ఒక్కొక్కరిగా లెఫ్ట్ అవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆ ఎస్సై ఓ వీడియో సందేశాన్ని గ్రూప్‌లో పోస్ట్ చేశారు. "ఏం మామలూ.. బాగున్నారా? మీ ఫోన్ నంబర్లు అన్నీ నా దగ్గర సేవ్ అయి ఉన్నాయి. గ్రూప్ వీడినా లాభం లేదు. త్వరలోనే మీ అందరినీ పిలిపించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తాం" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి గ్రూపులు నడపడం చట్టరీత్యా నేరమని, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడమేనని అధికారులు హెచ్చరించారు. గ్రూప్ సభ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.