Pawan Kalyan: అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు, గురువారం పెద్దల సభలోనూ నెగ్గడంతో అమరావతికి రాజధానిగా తిరుగులేని చట్టపరమైన హోదా లభించింది. ఈ చారిత్రక పరిణామం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమని, ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణ అని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. "త్యాగాల పునాదుల నుంచి, ఆశలు మోసుకొచ్చిన కన్నీటి నుంచి, అనిశ్చితిని భరించిన నిశ్శబ్దం నుంచి అమరావతి నేడు కోట్లాది ప్రజల ఆశలను మోస్తూ గౌరవంగా నిలబడింది" అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా రాజధాని ఉనికిపై సాగిన కుట్రలు, అపోహలు, న్యాయపరమైన చిక్కులను అధిగమించి, పార్లమెంట్ సాక్షిగా అమరావతి ఒక అజేయ శక్తిగా అవతరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ఈ విజయం ఎన్డీఏ ప్రభుత్వంపై చెక్కుచెదరని విశ్వాసం ఉంచిన ప్రతి పౌరుడిదని తెలిపారు.
అమరావతి ఆత్మ రైతుల త్యాగంలోనే ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. "33,000 ఎకరాలకు పైగా భూములను రైతులు బలవంతంగా ఇవ్వలేదు. భవిష్యత్‌పై, ఒక దార్శనికతపై నమ్మకంతో ఇచ్చారు. ఈ రోజు వారి నమ్మకాన్ని గౌరవించగలిగాం" అని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో రాష్ట్రానికి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఆయన నివాళులు అర్పించారు.
గత కొన్నేళ్లుగా అమరావతిని అనిశ్చితిలోకి నెట్టారని, విధానాలు మార్చి రైతులను మోసం చేశారని, ప్రజల ఆకాంక్షలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ అనిశ్చితికి తెరపడిందన్నారు. ఇది కేవలం రాజధాని పునరుద్ధరణ మాత్రమే కాదని, ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణ అని పేర్కొన్నారు. స్పష్టమైన దార్శనికతతో అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రతి కీలక సమయంలో రాష్ట్రానికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, బిల్లుకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై అమరావతి స్థిరత్వం, ప్రగతికి చిహ్నంగా, తరతరాలకు వారధిగా నిలిచే ప్రజల రాజధాని అవుతుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.