ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు
- తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్న ముఖ్యమంత్రి
- ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమన్న ముఖ్యమంత్రి
- తక్కువ సమయంలో పూర్తి చేశారంటూ అధికారులకు కితాబు
దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించామని పేర్కొన్నారు.
డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు వేగవంతమవుతాయని అన్నారు. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తిచేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని పునరుద్ఘాటించారు.