Ravindra Jadeja: సీఎస్కే నుంచి వచ్చాక ధోనీతో మాట్లాడలేదు: రవీంద్ర జడేజా

Ravindra Jadeja Says He Hasnt Spoken to Dhoni After Leaving CSK
షార్ట్స్‌లో చూడండి
తాను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో మాట్లాడలేదని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రవీంద్ర జడేజా తెలిపాడు. ధోనీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచుతాడని, అందుకే తాను మాట్లాడలేకపోయానని తెలిపాడు. ఐపీఎల్-19లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తయింది. జడేజా రెండు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జడేజా మాట్లాడుతూ, 13 సంవత్సరాల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తాను, ఈసారి అదే జట్టుకు వ్యతిరేకంగా మైదానంలోకి దిగడం కాస్త వింతగా అనిపించిందని అన్నాడు. తాను, ధోనీ కలిసినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడుకుంటామని తెలిపాడు.

జడేజా రాజస్థాన్ జట్టుతోనే ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు చెన్నైతో ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. చెన్నై ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దుబేల వికెట్లను జడేజా తీశాడు. శివమ్ దుబే తనకు చాలాకాలంగా తెలుసని, అతడు భారీ షాట్లు ఆడుతాడని జడేజా పేర్కొన్నాడు. అందుకే ఆఫ్ స్టంప్ అవతల బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పాడు. గౌహతి పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు.
Go Back to Shorts
Ravindra Jadeja
MS Dhoni
Chennai Super Kings
Rajasthan Royals
IPL 2024
Sarfaraz Khan
Shivam Dube

More Telugu News