Indian worker: కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కువైట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇరాన్ జరిపిన ఓ దాడిలో భారత కార్మికుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒక విద్యుత్ కేంద్రంలోని భవనం కూడా దెబ్బతిన్నట్లు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఆదివారం సాయంత్రం దేశంలోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడికి పాల్పడిందని కువైట్ అధికారులు తెలిపారు. "ఈ దాడిలో ప్లాంట్‌లోని ఒక సర్వీస్ భవనం దెబ్బతింది. ఒక భారతీయ కార్మికుడు మరణించారు" అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు.
పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య ఏడుకు చేరిందని రాయిటర్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. వీరిలో సౌదీ అరేబియాలో ఒకరు, ఒమన్‌లో ఇద్దరు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇద్దరు ఉన్నారు. మరో భారతీయుడు గల్లంతైనట్లు సమాచారం.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. తాజా ఘటనపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం లేదా భారత విదేశాంగ శాఖ (MEA) ఇంకా స్పందించలేదు. అయితే, మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించడానికి, ఆయా దేశాల్లో చిక్కుకున్న పౌరులకు సహాయం చేయడానికి తమ రాయబార కార్యాలయాలు సమన్వయం చేస్తున్నాయని విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది.