శాలరీ స్లిప్‌లో మోసం.. ఆఫీసులోనే హెచ్ఆర్ను కడిగి పారేసిన ఉద్యోగి.. వీడియో ఇదిగో!
- ఆఫర్ లెటర్ ప్రకారం జీతం ఇవ్వని కంపెనీ
- భారీగా కోతలు విధించడంతో తిరగబడిన ఢిల్లీ ఉద్యోగి
- జీతం ఎందుకు తక్కువ వచ్చిందని ప్రశ్న
- నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన హెచ్ఆర్ టీమ్
- ఈ వాగ్వాదాన్ని రహస్యంగా మొబైల్లో రికార్డ్ చేసిన బాధితుడు
- కార్పొరేట్ కంపెనీల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు ఉద్యోగి తన శాలరీ స్లిప్ పట్టుకుని హెచ్ఆర్ క్యాబిన్‌కు వెళ్లాడు. కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా, తన జీతంలో భారీగా అక్రమ కోతలు ఎందుకు విధించారని గట్టిగా ప్రశ్నించాడు. అయితే, ఆ ఉద్యోగి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా, హెచ్ఆర్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా సమాధానాలు ఇవ్వడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సదరు ఉద్యోగి ఆ సంభాషణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ వీడియో చూసిన లక్షలాది మంది ఉద్యోగులు, నిపుణులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు. భారతదేశంలోని ప్రైవేట్ రంగంలో లేబర్ రైట్స్ (కార్మిక హక్కులు), పేరోల్ పారదర్శకత పూర్తిగా లోపించాయని కామెంట్లు పెడుతున్నారు. శాలరీ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై సదరు కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, అంతర్గత విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఎల్లప్పుడూ ఆఫర్ లెటర్స్, శాలరీ బ్రేకప్స్, కంపెనీతో జరిగిన ఈమెయిల్ సంభాషణలను భద్రంగా దాచుకోవాలని జాబ్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.