Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: ఐజేయూ 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు
రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని, తమ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు పూర్తి భరోసా కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో మీడియా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొందని, కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మీడియాకు తిరిగి ప్రశ్నించే గొంతుక వచ్చిందన్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ వచ్చింది
గత ప్రభుత్వ హయాంలో మీడియా ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, "గత ఐదేళ్లలో క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు చూశారు. తమ తప్పులను ఎత్తిచూపే మీడియాను నియంత్రించేందుకు జీవో నెం. 2430 వంటివి తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశారు. ఆనాడు జర్నలిస్టులకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మా ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను గౌరవిస్తుంది. ప్రశ్నించే హక్కును కల్పిస్తుంది," అని చంద్రబాబు అన్నారు.
విలువలు పడిపోతున్నాయి.. రాజకీయ పార్టీలకు మీడియా ప్రమాదకరం
ప్రస్తుత జర్నలిజంలో విలువలు పడిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "రాజకీయ పార్టీలే సొంతంగా మీడియా సంస్థలను నడపడం సమాజానికి అత్యంత ప్రమాదకరం. వారు తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలను సైతం నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. దీనికి నా జీవితమే ఒక ఉదాహరణ. 2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే, మొదట గుండెపోటు అని ప్రచారం చేసి, ఆ తర్వాత ఆ నెపాన్ని నాపై మోపారు. 'నారాసుర రక్త చరిత్ర' అంటూ నా చేతిలో కత్తి పెట్టి ఓ పత్రికలో తప్పుడు వార్త రాశారు. ఇది వ్యక్తిత్వ హననం కాదా? సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నియంత్రించేందుకు జర్నలిస్టులు కృషి చేయాలి," అని ఆయన సూచించారు.
ప్రోగ్రెసివ్ వార్తలు ఇవ్వండి
రాష్ట్ర పునర్నిర్మాణంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. "నేను మిమ్మల్ని పాజిటివ్ వార్తలు ఇవ్వమని కోరడం లేదు. ప్రోగ్రెసివ్ వార్తలు ఇవ్వాలని కోరుతున్నా. రాష్ట్రంలో మంచిని, శాంతిని, అభివృద్ధిని ప్రోత్సహించండి. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24 మధ్య కాలంలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు మేం రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నాం. అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాం. రాబోయే ఐదేళ్లలో అమరావతిలో అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు. ఈ అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది," అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. "ఉమ్మడి రాష్ట్రంలో మండల స్థాయి రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. జర్నలిస్టుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశాం. వారిపై దాడులు జరిగితే ఎస్పీ స్థాయి అధికారి విచారించేలా నిబంధనలు పెట్టాం. 2014-19 మధ్య డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు, బస్సు పాసుల్లో రాయితీలు, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాం. గత ప్రభుత్వం వాటిని తొలగించింది. మేము 2018లో 20 వేల అక్రిడేషన్లు ఇస్తే, వారు సగానికి తగ్గించారు. ఇప్పుడు అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడేషన్ అందిస్తాం" అని స్పష్టం చేశారు.
స్థలాల కేటాయింపుపై హామీ
గతంలో హైదరాబాద్‌లో మంత్రుల క్వార్టర్ల స్థలాన్ని ప్రెస్ క్లబ్ కోసం కేటాయించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో అమరావతిలో ఐజేయూ కార్యాలయానికి స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక సబ్-కమిటీకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు, సమావేశానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఐజేయూ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆయన సీనియర్ జర్నలిస్టులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.