Eid Mubarak: చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర తారలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ పండుగ సందర్భంగా చిరంజీవి, కమల్ హాసన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు సోషల్ మీడియా వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు. శాంతి, సంతోషం, సౌభాగ్యంతో అందరి జీవితాలు నిండిపోవాలని ఆకాంక్షించారు.
"ఇస్లామిక్ సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం వంటి దయాగుణమే నిజమైన సేవ అని ఈ పండుగ నేర్పుతుంది" అని కమల్ హాసన్ తన ఈద్ సందేశంలో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి.. "ఈద్ ముబారక్. ఈ అందమైన పండుగ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని కోరుకుంటున్నాను" అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "అందరికీ ఈద్ ముబారక్. మీకు, మీ ప్రియమైన వారికి ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలి" అని ఆకాంక్షించారు.
"మీకు ప్రేమ, ఐక్యత, మీ ప్రియమైనవారితో అందమైన క్షణాలు దక్కాలి" అని జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నటులు శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, కార్తి కూడా తమ అభిమానులకు, ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలు నిర్మాణ సంస్థలు సైతం పండుగ శుభాకాంక్షలు పంచుకున్నాయి.