రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్... వేదిక ఇదే!

Pawan Kalyans Ustaad Bhagat Singh Pre Release Event Details
  • పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్'
  • గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ ను డైరెక్ట్ చేసిన హరీశ్ శంకర్
  • హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా
  • మార్చి 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
  • ఈ సాయంత్రం ట్రైలర్ విడుదల... రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • అభిమానుల్లో ఫుల్ జోష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సందడి మొదలైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 15న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే, అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈరోజు (మార్చి 14) సాయంత్రం 6:30 గంటలకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేశారు.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరూ ఈ సినిమాకు సంగీతం అందించటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ పాటలకు స్వరకల్పన చేయగా, తమన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

ఈ రోజు ట్రైలర్, మరుసటి రోజే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉండటంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
Go Back to Shorts
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Mythri Movie Makers
Telugu Movie
Pre Release Event
Yousufguda Police Grounds
Devi Sri Prasad
Thaman
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Telangana

More Telugu News