India England T20: భారత్-ఇంగ్లండ్ సెమీస్... డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో అన్ని రికార్డులు బద్దలు
- టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్
- భారత్ ఇంగ్లండ్ మ్యాచ్‌ను వీక్షించిన 6.52 కోట్ల మంది
- జియో హాట్‌స్టార్ వేదికగా నమోదైన సరికొత్త రికార్డు
- ప్రపంచంలో ఏ లైవ్ ఈవెంట్‌కూ రాని స్పందన ఇదే
- క్రీడా చరిత్రలో ఇదొక గ్లోబల్ బెంచ్‌మార్క్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ముంబై వాంఖెడే స్టేడియంలో గతరాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో ఇప్పటివరకు ఉన్న అన్ని ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ వేదికగా గరిష్టంగా 6.52 కోట్ల (65.2 మిలియన్లు) మంది ఒకే సమయంలో వీక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏ లైవ్ ఈవెంట్‌కు కూడా ఈ స్థాయిలో డిజిటల్ ఆదరణ లభించలేదు. గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ, ఈ మ్యాచ్ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. క్రికెట్ పట్ల, ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌ల పట్ల అభిమానులకు ఉన్న ఆసక్తికి ఈ గణాంకాలే నిదర్శనమని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఐసీసీ మరియు జియో స్టార్ భాగస్వామ్యంతో ఇంత భారీ స్థాయి వీక్షకులను ఎంగేజ్ చేయడం సాంకేతికంగా గొప్ప విజయమని నిపుణులు పేర్కొన్నారు.
క్రీడలు, మీడియా మరియు స్ట్రీమింగ్ రంగంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది. గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం తమకు గర్వకారణమని, అభిమానులను పెద్ద ఎత్తున ఆకర్షించడంలో తమ బృందం కృషి ఫలించిందని సంబంధిత అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. భారతదేశంలో క్రికెట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ రికార్డు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ లో సంజూ శాంసన్ 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా... ఇంగ్లండ్ జట్టులో 22 ఏళ్ల యువ ఆటగాడు జాకబ్ బెతెల్ సంచలన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లో 108 పరుగులు చేసిన ఈ కుర్రాడు చివరి ఓవర్లో అవుటయ్యాడు.