72 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... మిగతా బెనిఫిట్స్ ఇవిగో!
- బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్
- 72 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా
- అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పొందవచ్చు. డేటా విషయానికొస్తే, ఈ ప్లాన్ కింద రోజుకు 2.5జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.