Raghurama Krishnam Raju: రఘురామ క్రికెట్ గాయంపై సునీల్ కుమార్ సెటైర్లు... రఘురామ ఘాటు రిప్లై
- సోషల్ మీడియా వేదికగా రఘురామ, సునీల్ కుమార్ మధ్య డైలాగ్ వార్
- క్రికెట్ ఆడుతూ గాయపడిన రఘురామపై సునీల్ కుమార్ సెటైర్లు
- అరగంట టైం ఇస్తే హింసను రుచి చూపిస్తానంటూ డిప్యూటీ స్పీకర్ సవాల్
- కస్టోడియల్ టార్చర్ వ్యవహారంపై ఇద్దరి మధ్య మాటల తూటాలు
- సునీల్ కుమార్ అరెస్ట్ ఖాయమంటూ రఘురామకృష్ణరాజు ధీమా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ తారాస్థాయికి చేరింది. 2021 నాటి కస్టోడియల్ హింస ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ పరస్పరం తీవ్రమైన సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నీలో ఆడుతూ రఘురామ కృష్ణంరాజు చేతికి గాయమైంది. రెండు ఎముకలు విరగడంతో ఆయన బ్యాండేజ్ వేసుకునే అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సునీల్ కుమార్ 'ఎక్స్' వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఆటలో కిందపడితేనే రెండు ఎముకలు విరిగాయి.. మరి కస్టడీలో అంతలా కొట్టామని చెబుతున్నారు.. నిజంగా కొట్టి ఉంటే ఇంకెన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా?" అంటూ పరోక్షంగా నాటి కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు అబద్ధమని పోస్ట్ చేశారు.
సునీల్ కుమార్ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు అంతే ఘాటుగా స్పందించారు. సునీల్ కుమార్ అనుమతిస్తే అరగంటలో కస్టడీ హింసను రుచి చూపిస్తానని సవాల్ చేశారు. "నన్ను సీఐడీ కస్టడీలో హింసించినట్టుగానే.. కాళ్లు కట్టేసి అరికాళ్లపై రబ్బర్ బెల్టుతో, లాఠీలతో రక్తపు చారలు పడేలా కొట్టగలను. సునీల్ కుమార్ సిద్ధమంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెడదాం" అంటూ కౌంటర్ ఇచ్చారు.
2021లో రాజద్రోహం కేసులో అరెస్ట్ అయినప్పుడు అప్పటి సీఐడీ అధికారులు తనను తీవ్రంగా హింసించారని రఘురామ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు విచారణ వేగం పుంజుకుంది. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను హింసించిన మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అరెస్ట్ కావడం ఖాయమని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు