Vijay Deverakonda: ప్రధాని మోదీ నుంచి ఆశీస్సులు తీసుకున్న ‘విరోష్’
- ఫోటో విడుదల చేసిన విజయ్ టీమ్
- మార్చి 4న హైదరాబాద్ ‘తాజ్ కృష్ణ’లో గ్రాండ్ రిసెప్షన్
- ఆ వేడుకకు ప్రధానిని ఆహ్వానించిన విజయ్, రష్మిక
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే ఈ జంట ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ గోప్యంగా ఉన్న ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను తాజాగా విజయ్ టీమ్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం
ప్రధాని మోదీని కలిసి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు మార్చి 4న హైదరాబాద్ లో జరగనున్న తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నూతన దంపతులకు తన శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. కాగా, ఉదయ్‌పూర్ లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యే ‘విరోష్’ పెళ్లి జరగగా, చిత్ర పరిశ్రమ, రాజకీయ మరియు క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ప్లాన్ చేశారు. మార్చి 4న జరగబోయే ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు.