సూపర్-8 ప్రిసీడింగ్ విధానంపై విమర్శలు.. స్పందించిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav Responds to Super 8 Preceding Criticism
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో టీమిండియా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సూపర్ 8 ప్రిసీడింగ్ విధానంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. దీనిని ఎవరు చేస్తారో తనకైతే తెలియదని, ఒకవేళ ఆ స్థానంలో నేను ఉంటే మాత్రం కచ్చితంగా సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు. గతంలోనూ ఇదే విషయం చెప్పానని వెల్లడించాడు.

వివిధ వేదికలలో మ్యాచ్‌లు ఆడటంపై కూడా సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఆటగాళ్లు చాలామంది ఐపీఎల్ ఆడుతున్నందున వేదిక విషయంలో ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నాడు. ఐపీఎల్‌కు ఎవరు వచ్చినా భారతదేశంలోని అన్ని వేదికలలో ఆడారని గుర్తు చేశాడు.

సూపర్ 8 గ్రూపులను నిర్ణయించడానికి ఉపయోగించిన సీడింగ్ విధానంపై విమర్శలు వచ్చాయి. టోర్నీకి ముందే 8 జట్లకు సూపర్ 8లో సీడింగ్ కేటాయించారు. ఆ జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తే ముందుగా కేటాయించిన స్థానాల్లోనే ఆడుతాయి. సీడింగ్ ద్వారా భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూప్‌లోకి వచ్చాయి. లీగ్ దశల్లో గొప్పగా రాణించిన జట్లకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి.
Go Back to Shorts
Suryakumar Yadav
T20 World Cup
Super 8
India vs South Africa
ICC
Seeding System
Cricket

More Telugu News