బెంగళూరులో ఏఎంబీ సినిమాస్‌... డాల్బీ విజన్ ఆస్వాదించిన మహేశ్ బాబు

Mahesh Babu Launches AMB Cinemas with Dolby Vision in Bengaluru
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల బెంగళూరులో పర్యటించారు. అక్కడ కొత్తగా ప్రారంభమైన తమ ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ఆయన సందర్శించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా డాల్బీ విజన్ టెక్నాలజీతో ఏర్పాటైన ఈ థియేటర్‌లో సినిమా చూసి అద్భుతమైన అనుభూతిని పొందానని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై అభిమానులు చూపిన ప్రేమకు ముగ్ధుడైన మహేశ్, తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

"సౌత్ ఇండియాలోనే మొదటి డాల్బీ విజన్‌ను మా ఏఎంబీ సినిమాస్ బెంగళూరులో అనుభవించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. నన్ను చూడటానికి ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులను కలవడం కూడా అంతే సంతోషాన్నిచ్చింది. బెంగళూరు చూపిన ఈ ప్రేమకు నేను వినమ్రుడినయ్యాను. గాలి నిండా ప్రేమే నిండిపోయింది" అని మహేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అదేవిధంగా, తమ కలలను సాకారం చేయడానికి అహర్నిశలు శ్రమించిన ఏఎంబీ సినిమాస్ బృందాన్ని చూసి గర్వంగా ఉందని ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగళూరులోనూ తమ బ్రాంచ్‌ను విస్తరించడం ద్వారా మహేశ్ బాబు వ్యాపార రంగంలో మరో ముందడుగు వేశారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, మహేశ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Mahesh Babu
AMB Cinemas
Bengaluru
Dolby Vision
South India
Multiplex
Movie Theater
Hyderabad
Tollywood
Entertainment

More Telugu News