ఢిల్లీ ఏఐ సదస్సులో మోదీ సమక్షంలో... చేతులు కలపని ఇద్దరు సీఈవోలు

Sam Altman and Dario Amodei Avoid Handshake at Delhi AI Summit
షార్ట్స్‌లో చూడండి
'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ చేతులు కలపకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. దీని ద్వారా వారి మధ్య ఉన్న స్పర్థలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు ఒకే వేదికపై కనిపించారు.

అందరూ గ్రూప్ ఫొటో దిగారు. ఆ సమయంలో శామ్ ఆల్ట్‌మన్, డారియో ఆమోడెయ్ పక్కపక్కనే నిల్చున్నారు. వీరు ప్రధాని నరేంద్ర మోదీకి పక్కనే ఎడమ వైపుకు నిలుచున్నారు. టెక్ లీడర్లంతా చేతులు కలిపినప్పటికీ, పక్కపక్కనే ఉన్న వీరు మాత్రం చేతులు కలపలేదు.

ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. డారియో అమోడెయ్, ఆయన సోదరుడు డానియెల్లా అమోడెయ్ ఇద్దరూ 'ఓపెన్ ఏఐ' సంస్థలో వైస్ ప్రెసిడెంట్స్ హోదాలో పనిచేశారు. శామ్ ఆల్ట్‌మన్ వారికి బాస్‌గా ఉన్నారు. అయితే ఆయన భద్రత కంటే వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ సోదరులిద్దరూ 'ఓపెన్ ఏఐ'ని వీడారు. 2021లో అమోడెయ్ 'ఆంథ్రోపిక్'ను ప్రారంభించారు. దీంతో వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
Go Back to Shorts
Sam Altman
OpenAI
Anthropic
Dario Amodei
AI Impact Summit Delhi
Narendra Modi
Artificial Intelligence

More Telugu News