ఆసుపత్రిలో నటి పావలా శ్యామల, కుమార్తె.. అనాథాశ్రమానికి తరలింపు
- నటి పావలా శ్యామల, కుమార్తెను ఆసుపత్రిలో వదిలివెళ్లిన అపరిచితులు
- వైద్య పరీక్షల్లో నెగటివ్‌గా వచ్చిన టీబీ రిపోర్టులు
- ఉస్మానియాకు వెళ్లేందుకు నిరాకరించిన తల్లికూతుళ్లు
- పోలీసుల సహాయంతో అనాథాశ్రమానికి తరలించిన అధికారులు
ఒకప్పటి సినీ నటి పావలా శ్యామల, ఆమె కుమార్తె మాధవిని గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో వదిలివెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. గురువారం ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రి వద్ద వారిని వదిలి వెళ్లగా, పోలీసులు శుక్రవారం వారిని ఒక అనాథాశ్రమానికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు తల్లికూతుళ్లను ఆసుపత్రి ప్రాంగణంలో వదిలి వెళ్లారు. వారిని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, టీబీ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. అయితే ఇతర అనారోగ్య సమస్యల దృష్ట్యా మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఉస్మానియా ఆసుపత్రిలో ఉండటానికి పావలా శ్యామల, ఆమె కుమార్తె విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో వారు సాయంత్రానికి తిరిగి చెస్ట్ ఆసుపత్రికే చేరుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి అధికారులు బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారికి రక్షణ కల్పించి, శుక్రవారం ఒక స్థానిక అనాథాశ్రమానికి తరలించారు.