Joy Alukkas: పంజాగుట్టలో నగల దుకాణంలో రూ.1 కోటి విలువైన బంగారం చోరీ

Joy Alukkas Employee Steals 1 Crore Worth Gold in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో ఒక బంగారం దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. దుకాణంలో పని చేసే ఉద్యోగి రూ.1 కోటి విలువ చేసే ఆభరణాలను దొంగిలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా రోజూ కొన్ని ఆభరణాలను దొంగిలించాడు.

పంజాగుట్టలోని జోయ్ అలుక్కాస్ నగల దుకాణంలో పని చేసే ఉద్యోగి అజిత్ ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు వెల్లడైంది. విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.

ఆభరణాలను ఎత్తుకువెళ్లిన ఉద్యోగిని గుర్తించి యాజమాన్యం పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి ఎవరైనా సహాయం చేశారా? లేక అతడు సొంతంగా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Joy Alukkas
Hyderabad
Panjagutta
Jewelry theft
Gold theft
Ajith
Crime news
Theft in jewelry shop

More Telugu News