Sudeep Kumar: రంజీలో 299 వద్ద ఔటైన్ బెంగాల్ ఆటగాడు.. ఓదార్చిన ఆంధ్ర ఆటగాళ్లు

Sudeep Kumar Misses Triple Century in Ranji Trophy
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో సుదీప్ కుమార్ ఒక్క పరుగుతో ట్రిపుల్ సెంచరీని కోల్పోయాడు. రంజీ ట్రోఫీలో ఆంధ్రతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ బెంగాల్ బ్యాట్స్‌మన్ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్స్‌లతో 299 పరుగులు చేశాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన సుదీప్ ఆంధ్ర బౌలర్ షేక్ రషీద్ బౌలింగ్‌లో రికార్డుకు ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు.

సుదీప్ ఔటయ్యాక తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు వెళుతుండగా, ఆంధ్ర ఆటగాళ్లు 'బాధపడకు' అంటూ ఓదార్చారు. ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 299 పరుగుల వద్ద ఔటైన తొలి భారత బ్యాటర్ సుదీప్ కావడం గమనార్హం. 1991లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ క్రోవ్ శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 299 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Go Back to Shorts
Sudeep Kumar
Ranji Trophy
Bengal Cricket
Andhra Cricket
Cricket Quarter Final
Sheikh Rasheed

More Telugu News