Kodandaram: కేసీఆర్ ను జాతిపిత అంటే ఒప్పుకోను: కోదండరామ్

Kodandaram Opposes Calling KCR Father of Telangana
  • జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది కాదన్న కోదండరామ్
  • ఉద్యమకారులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శ
  • తెలంగాణ అస్థిత్వాన్ని వ్యక్తిగత లబ్ధికి వాడుకోవడం దారుణమని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది కాదని... అది ప్రజలు ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ అస్థిత్వాన్ని వ్యక్తిగత లబ్ధికి వాడుకోవడం దారుణమని అన్నారు.  

మరోవైపు, ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జయశంకర్ నిజమైన జాతిపిత అని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత అని కొనియాడారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అని ప్రశ్నించారు. వేరే వాళ్ల ఫోన్లు దొంగచాటుగా వినేవాళ్లు జాతిపితలా? అని ప్రశ్నించారు. 

రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందిస్తూ... జాతిపిత అంటే ఏమిటో రేవంత్ కు తెలుసా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ చరిత్ర కేసీఆర్ దని చెప్పారు. తెలంగాణ కోసం ఎప్పుడైనా కొట్లాడిన చరిత్ర రేవంత్ కు ఉందా? అని ఎద్దేవా చేశారు.
Kodandaram
KCR
K Chandrasekhar Rao
Telangana
Jati Pita
Revanth Reddy
Harish Rao
Telangana Activists
BRS
Telangana History

More Telugu News