ప్రజలు తిరస్కరించినా ప్రచారం కోసం పాకులాట.. ప్రశాంత్ కిశోర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

National
Advertisement
  • బీహార్ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ జన్ సురాజ్ పార్టీ పిటిషన్
  • విచారణకు తిరస్కరిస్తూ పీకే పై సీజేఐ ఫైర్
  • 238 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటూ గెలవలేదని వ్యాఖ్య
Advertisement
‘‘బీహార్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనేది స్పష్టంగా తెలిసిపోయింది.. ఇప్పుడు మీరేమో ఈ కోర్టును మీ ప్రచారం కోసం వాడుకుని లబ్ది పొందాలని చూస్తున్నారా..?” అంటూ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ జన్ సురాజ్ పార్టీ తరఫున దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సీజేఐ తిరస్కరించారు. ఈ పిటిషన్ ను బీహార్ హైకోర్టుకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జన్ సురాజ్ పార్టీ తరఫున హాజరైన లాయర్లకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ, బీజేపీ కూటమి అవకతవకలకు పాల్పడిందని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సంక్షేమ పథకం పేరుతో మహిళలకు రూ.10 వేలు పంచిందని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఒక మహిళకు రూ.10 వేలు అందజేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి ఘన విజయానికి ఇదే కారణమని విమర్శించింది.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని ఆరోపిస్తూ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఫలితాలు చెల్లవంటూ తీర్పు వెలువరించాలని జన్ సురాజ్ పార్టీ కోరింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 238 సీట్లలో పోటీచేసిన జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేదనే విషయాన్ని గుర్తుచేసింది. దీనిని బట్టి బీహార్ ప్రజలు మిమ్మల్ని (ప్రశాంత్ కిశోర్) తిరస్కరించారని స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం న్యాయవ్యవస్థ ద్వారా ప్రచారం పొందేందుకే ఈ పిటిషన్ దాఖలు చేశారని విమర్శిస్తూ పిటిషన్ ను బీహార్ హైకోర్టుకు రీడైరెక్ట్ చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22

మోదీతో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. 'రామ్, సరయూ' అంటూ ప్రధాని ట్వీట్

06 Nov, 16:18

సాధారణ ఉప్పుకు బదులు ఇది వాడితే.. లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! 'నేచర్ హెల్త్' కీలక అధ్యయనం

06 Nov, 16:14

పంచాయతీ నిధులను పప్పుబెల్లాల్లా వాడేశారు: వైసీపీపై అశోక్ బాబు ఫైర్

06 Nov, 15:50

భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై కోర్టుకెక్కిన భర్త!

06 Nov, 15:47

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలకు మంటలు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు!

06 Nov, 15:44

చిరంజీవి 'కాకా'పై పుకార్లకు చెక్.. సంక్రాంతికి రిలీజ్ పక్కా: కోన వెంకట్

06 Nov, 15:42

ముంబైలో మళ్ళీ బాంబు బెదిరింపులు.. అమితాబ్ బంగ్లా సహా పలు ప్రాంతాలు టార్గెట్!

06 Nov, 15:24

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.. రైతులతో ముఖాముఖి

06 Nov, 15:21

కోహ్లీ 100 సెంచరీల కల నెరవేరేనా? 2027 ప్రపంచకప్‌ లోపు కష్టమంటున్న మాజీ కోచ్‌!

06 Nov, 15:18

రాహుల్ గాంధీ టీ మీటింగ్‌కు సిద్ధరామయ్య గైర్హాజరు!

06 Nov, 15:15

కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మెగా ప్లాన్.. రేపటి నుంచి మూడ్రోజుల పర్యటన

06 Nov, 15:11

అతడు లోన్‌ ఎగ్గొడితే.. మీరు కట్టాల్సిందేనా? గ్యారంటీ సంతకం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

06 Nov, 15:01

జీవితం క్రికెట్ కంటే పెద్దది.. భార్య క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్

06 Nov, 14:52
..More Telugu News