Gold Price: రూ.1,60,000 దిగువకు బంగారం, రూ.30 వేలు తగ్గిన వెండి ధర

Gold Price Drops Below Rs 160000 Silver Reduced Rs 30000
షార్ట్స్‌లో చూడండి
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో భారీగా క్షీణించిన బంగారం ధరలు, ఆ తర్వాత రెండు రోజులు పెరిగాయి. ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న రూ.7 వేలకు పైగా పెరిగిన పసిడి ధర, ఈరోజు దాదాపు అంతేస్థాయిలో దిగివచ్చింది.

దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,550 పలికింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,600 తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే వెండి కిలో రూ.30 వేలు క్షీణించి రూ.2,69,000 వద్ద ఉంది.

వివిధ నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది. బెంగళూరు రూ.1,59,560, చెన్నై రూ.1,62,680, ఢిల్లీ రూ.1,59,730, కోల్‌కతాలో రూ.1,59,570, ముంబైలో రూ.1,59,590గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఖరీదైన ఈ లోహాల ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర 4,919 డాలర్లు, ఔన్సు వెండి ధర 79 డాలర్లుగా ఉంది. ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరీ వెండి 7 శాతం మేర క్షీణించి రూ.2.49 లక్షల వద్ద ఉండగా, ఏప్రిల్ డెలివరీ బంగారం ధర రూ.1.53 లక్షల వద్ద ఉంది.
Go Back to Shorts
Gold Price
Gold Rate Today
Silver Price
Hyderabad Gold Rate
MCX Gold
Commodity Market
Rupee Value

More Telugu News