మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించి... స్వయంగా నడిపిన బాలయ్య

Both States
Advertisement
  • బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం
  • దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని 2007లో వాజ్‌పాయ్ చేతుల మీదుగా ప్రారంభించామన్న బాలకృష్ణ
  • ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని వెల్లడి
బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో బ్రాకీథెరపీ యూనిట్, రెండు ఆపరేషన్ థియేటర్లు, మోల్డ్ రూమ్స్, అదనపు క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును బాలకృష్ణ స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ 2007లో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ వాహనాన్ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆవిష్కరించారని తెలిపారు.
 
ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని.. ఈ ఏడాది మాత్రమే ఇప్పటికే 56 వేలకుపైగా పరీక్షలు చేసినట్లు బాలకృష్ణ వెల్లడించారు. మామోగ్రఫీతో పాటు అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మొబైల్ వాహనంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. స్క్రీనింగ్ తర్వాత అవసరమైన వారికి ఆస్పత్రికి తీసుకొని వచ్చి చికిత్స అందిస్తున్నామని వివరించారు. నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని తెలిపారు. 

ఆస్పత్రిలో అందరికీ సమానంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. రోగుల కోసం ఆధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ గురించి సులభంగా అర్ధమయ్యేలా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. మొబైల్ వాహనంలో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కల్గించే సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. సీఎంఐ ప్రోగ్రాం ద్వారా రోగులకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. ఆస్పత్రికి వీల్‌చైర్లను వితరణగా అందజేసినందుకు సాంబశివరావుకు ఈ సందర్భంగా బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Nandamuri BalakrishnaBasavatarakam Indo American Cancer HospitalCancer ScreeningMobile Cancer Screening BusAtal Bihari VajpayeeCancer AwarenessHealthCancer TreatmentAndhra Pradesh

More Telugu News

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల వ్యవధిలో రూ.3 లక్షల కోట్లు ఆవిరి!

23 Nov, 12:30

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి: కోమటిరెడ్డి

23 Nov, 12:28

ఆమె వల్లే చాలా నేర్చుకున్నా: శోభితతో సీక్రెట్ లవ్, పెళ్లి విశేషాలు పంచుకున్న నాగచైతన్య!

23 Nov, 12:27

గెలిచే మ్యాచ్ డ్రా.. భారత్ దెబ్బకు తారుమారైన డబ్ల్యూటీసీ ర్యాంకులు

23 Nov, 12:24

తెలుగు, తమిళంలో నటన కంటే శరీర భాగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు: తాప్సీ

23 Nov, 12:23

సినిమాలే జీవితం కాదు.. ఆ గ్యాప్ నాకోసం: నిత్యా మేనన్

23 Nov, 12:19

15 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను ఎందుకు వదిలేశారు? తొలి టెస్టు డ్రాపై కెప్టెన్ గిల్ వివరణ

23 Nov, 11:41

బీఆర్ఎస్ నేతల నిర్బంధంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

23 Nov, 11:39

కోడింగ్, లెక్కలు అన్నీ ఏఐకేనా? ఇకపై మనుషులు గ్రంథాలు చదువుకోవాల్సిందేనా? జోహో బాస్ షాకింగ్ పోస్ట్!

23 Nov, 11:38

మేయర్ ప్రసంగం ఇస్తుంటే.. వెనుక వ్యక్తి వింత చేష్టల‌తో నెట్టింట 'ఏలియన్' అయిపోయాడు!

23 Nov, 11:37

శ్రీ సత్యసాయి బాబా జయంతి ఇకపై రాష్ట్ర పండుగ: నారా లోకేశ్

23 Nov, 11:36

పేదరికం అంటే డబ్బులు లేకపోవడమే కాదు.. లింక్డిన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పోస్ట్‌ వైరల్

23 Nov, 11:35

బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి.. స్పందించిన యాజమాన్యం

23 Nov, 11:30

టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డ్రా తో ముగిసిన మొదటి టెస్ట్

23 Nov, 11:28

సన్నీ డియోల్ కొడుకుతో సారా టెండూల్కర్ పెళ్లి?.. అసలు నిజమిదే!

23 Nov, 11:27
..More Telugu News